నూతన నటినటులతో నీది నాది మరొక కథ చిత్రం పోస్టర్ ఆవిష్కరణ

0
4

ఘనంగా “నీది నాది మరో కథ” చిత్ర పోస్టర్ ఆవిష్కరణ

విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఆంధ్ర టాకీస్ బ్యానర్‌పై దార రవి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న “నీది నాది మరో కథ” చిత్ర పోస్టర్‌ను 23వ డివిజన్ కార్పొరేటర్ నెలబండ్ల బాలస్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని, చిన్న సినిమాలకు తమ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.

దర్శకుడు దార రవి మాట్లాడుతూ, ఇది యూత్‌కు కనెక్ట్ అయ్యే చక్కని ప్రేమకథ అని, అంతర్లీనంగా ఒక మంచి సందేశం ఉంటుందని చెప్పారు. హీరో గంగాధర్, హీరోయిన్ ప్రవల్లిక తమకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేముల దుర్గారావు, పంపిణీదారులు జయరాం, ఓం, రమేష్ తదితరులు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.