మర్రిపాలెంలో ఘనంగా నూతన విగ్రహాల ప్రతిష్ట*
ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి దంపతులు*
నాగాయలంక మండలం మర్రిపాలెంలో నూతన ఆలయంలో గురువారం దేవతామూర్తుల ప్రతిష్టా మహోత్సవం జరిగింది. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి దంపతులు విచ్చేసి నూతన శ్రీ రాధాకృష్ణ, శ్రీ అభయ ఆంజనేయ దేవాలయాల పునఃప్రతిష్ట, శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ ప్రతిష్టలో భాగస్వాములయ్యారు.
గుండేపూడి నాగరాజు శేఖర శర్మ బ్రహ్మత్వంలో నూతన శ్రీ రాధాకృష్ణ, శ్రీ అభయ ఆంజనేయ స్వామి, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహాలు, ఆలయ ధ్వజస్థంభ, గోపుర కలశ స్థిరయంత్ర ప్రతిష్టా మహోత్సవం జరిపించారు. ఎమ్మెల్యే దంపతులు విచ్చేసి ప్రతిష్టా మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ పెద్దలు వారిని సత్కరించారు.










