మైనర్ బాలిక గర్భం వెనుక గురువు? కేసు నమోదు.

0
4

మదనపల్లెలో 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక ప్రసవించిన ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. గురువారం డీఎస్పీ పావని ఆస్పత్రిలో బాధితురాలిని విచారించగా, ఆమె గర్భానికి అదే పాఠశాలకు చెందిన గురువే కారణమని సమాచారం బయటపడింది.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన డీఎస్పీ వెంటనే కేసు నమోదు చేయాలని తాలూకా సీఐ కళా వెంకటరమణకు ఆదేశించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.