మదనపల్లె మండలం సీటీఎం దళితవాడకు చెందిన మేస్త్రి మురళి (45) హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ గ్రామస్థులు మంగళవారం తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత నరేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో, హత్య జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను పట్టుకోవడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.








