ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ అబ్జర్వర్లు నీలాద్రి, పవన్ కుమార్ సమక్షంలో, ఎన్నికల అధికారి మహేంద్రనాయక్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం పారదర్శకంగా ఎన్నికైంది.
మదనపల్లి రామారావు కాలనీ ఎంజి గ్రాండ్‌లో జరిగిన ఈ సమావేశంలో, రాజు రామ్మోహనరెడ్డి ఛైర్మన్‌గా, గడ్డం సాగర్ గౌరవ అధ్యక్షులుగా, డాక్టర్ జాన్ క్రిస్టోపర్ గౌరవ సలహాదారుగా, దిలీప్ కుమార్ అధ్యక్షులుగా, మురళీధర్ కార్యదర్శిగా, నరేష్ బాబు కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక ప్రక్రియను రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ అబ్జర్వర్లు ధృవీకరించారు.








