“చంద్రబాబు ఫోల్డబుల్ ఫోన్‌కు అశ్వినీ వైష్ణవ్ ఫిదా.. విశాఖ వేదికపై ఆసక్తికర దృశ్యం!”

0
5

విశాఖలోని తర్లువాడలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాడుతున్న అధునాతన ఫోల్డబుల్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను చూసి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ ఫోన్‌ను చేతిలోకి తీసుకుని దాని ఫీచర్లు, పనితీరు గురించి చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబును దేశం గర్వించే విజనరీ లీడర్‌గా వైష్ణవ్ కొనియాడారు. సాంకేతికతపై ఆయనకున్న మక్కువను అభినందిస్తూ, విశాఖ త్వరలో ‘ఐటీపట్నం’గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. నేతల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.