అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, చౌడేపల్లి మండలాలలో సోమవారం తహసిల్దార్లు పార్వతి, మధుసూదన్ పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరిగాయి.
పెట్రోల్, డీజిల్ సరఫరా నిబంధనల ప్రకారం చేయాలని, తగినంత నిల్వలు ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బంకుల పర్యవేక్షణకు వీఆర్వోలను నియమించారు# కొత్తూరు మురళి.








