హన్మాజిపేటలో వేడుకల సందడి: ఘనంగా కోడం దంపతుల షష్ఠిపూర్తి

0
3

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, నా అన్నవారే దూరమవుతున్న రోజుల్లో.. ఉమ్మడి కుటుంబం అనే మాటే కరువవుతున్న కాలంలో.వేములవాడ రూరల్ మండలం . హన్మాజిపేట గ్రామంలో జరిగిన షష్ఠి పూర్తి వేడుక అందరినీ ఆలోచింపజేసింది. అన్నదమ్ములు విడిపోవడమే తప్ప కలిసి ఉండటం అరుదైన ఈ రోజుల్లో, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఏకతాటిపై నిలిచి తమ తల్లిదండ్రులపై చూపిన ప్రేమ అందరినీ అబ్బురపరిచింది.

విడదీయలేని అనుబంధం.. ఆదర్శవంతం:

చిన్నపాటి మనస్పర్థలకే విడిపోయే అన్నదమ్ములను చూస్తున్న ప్రస్తుత సమాజంలో, కోడం లక్ష్మీరాజం – వెంకవ్వ దంపతుల కుమారులు తమ ఐకమత్యంతో ఆదర్శంగా నిలిచారు. తమను పెంచి పెద్దచేసి, ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల రుణం తీర్చుకునేందుకు వారంతా ఒకే మాటపై నిలిచారు. పచ్చని పందిరి కింద నలుగురు కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడు,మనుమండ్లు,మనుమరాళ్లు కలిసి ఒక్కతాటిపై నిలిచి జరిపిన ఈ షష్ఠిపూర్తి మహోత్సవం చూస్తుంటే, “ఇదీ అసలైన కుటుంబం” అని ఊరి జనం మెచ్చుకున్నారు.