సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం ఆర్లగూడెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.6,500 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు పోలీసులు రాగానే పరారయ్యారు. పట్టుబడిన వారిపై చిలుకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు. అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.










