పుంగనూరు: వర్షపు నీటి వివాదంలో గొడవ

0
3

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, ఎల్లారు బయలు గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా శశి కుమార్ పొలం నుంచి రామస్వామి పొలంలోకి నీరు చేరడంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది.

ఈ క్రమంలో రామస్వామి, నరసింహులు కలిసి శశి కుమార్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన శశి కుమార్ బుధవారం పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు# కొత్తూరు మురళి.