బుధవారం పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి పీలేరుకు బయలుదేరిన పల్లె వెలుగు బస్సు రొంపిచర్ల క్రాస్ రోడ్డు సమీపంలోకి రాగానే ముందు చక్రం ఊడిపోయింది.
ప్రయాణికులు ఆందోళనకు గురైనప్పటికీ, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కనే ఆపడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు# కొత్తూరు మురళి .








