తెలంగాణను ముంచెత్తుతున్న అకాల వర్షాలు అన్నదాతలను నిలువునా ముంచుతున్నాయి. ఈదురుగాలుల వానలకు వరి, మామిడి, అరటి, పసుపు పంటలు నేలవాలి తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులలో కనీస వసతులు లేకపోవడంతో ఆరుగాలం కష్టపడి తెచ్చిన ధాన్యం బస్తాలు తడిసి ముద్దవుతున్నాయి. తేమ శాతం పెరిగి, వడ్లు మొలకెత్తుతుండటంతో మద్దతు ధర దక్కక రైతులు అప్పులపాలవుతున్నారు. పెట్టుబడులు కూడా చేతికి అందే పరిస్థితి లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఆవేదన చెందుతోంది. తడిసిన ధాన్యాన్ని నిబంధనలు లేకుండా ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేసి, నష్టపోయిన పంటలకు తక్షణమే పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు..










