మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన నమోదైంది.
పోలీసులు విడుదల చేసిన లుక్‌అవుట్ నోటీసు ప్రకారం పొట్టబత్తిని ఇళయరాజా (33) అనే వ్యక్తి ఈ నెల 27వ తేదీ ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు.
ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇళయరాజా భార్య గండూరి ప్రశాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది.
ఆమె తన పిల్లలతో కలిసి స్కూల్ సెలవుల కారణంగా ఈ నెల 25న తన తల్లి ఇంటికి వెళ్లినట్లు తెలిపింది. అనంతరం 26వ తేదీ రాత్రి భర్తతో ఫోన్‌లో మాట్లాడినట్లు పేర్కొంది.
అయితే 27వ తేదీ ఉదయం భర్త ఉద్యోగానికి హాజరుకాలేదని కార్యాలయం నుంచి సమాచారం రావడంతో ఇంటికి చేరుకుని చూడగా, ఇంట్లో నుంచి కొన్ని బట్టలు మరియు మొబైల్ ఛార్జర్ తీసుకుని వెళ్లిపోయినట్లు గుర్తించినట్లు తెలిపింది.
అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
ఇళయరాజా ఎత్తు సుమారు 5 అడుగుల 5 అంగుళాలు, గోధుమ వర్ణం, నల్ల జుట్టు, గుండ్రటి ముఖాకృతి కలిగి ఉన్నట్లు పోలీసులు వివరించారు.
లోత్కుంట, ఆదర్శ్ నగర్ ప్రాంతానికి చెందిన ఆయన ఆచూకీ తెలిసిన వారు అల్వాల్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
#Sidhumaroju
Alwal










