భరత్‌కు ఆవాజ్ కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ మరియు రౌతసంకెపల్లి గ్రామంలో మే 29న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల గారు పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిత తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా గవర్నర్ గారు ఉదయం 10:35 గంటలకు హెలికాప్టర్ ద్వారా కలెక్టరేట్‌కు చేరుకుని, పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం, ఉదయం 11:00 గంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 3:00 గంటలకు రౌతసంకెపల్లి గ్రామంలో జరిగే ‘కుమురంభీం జల్ జంగిల్ జమీన్ స్ఫూర్తి గ్రామోత్సవం-2026’ కార్యక్రమానికి హాజరై, గిరిజన వీరులు కుమురం భీం, ఎడ్ల కొండల్ కాంస్య విగ్రహాల ప్రతిష్ఠాపనకు శంకుస్థాపన చేయడంతో పాటు స్థానికులకు సోలార్ ప్యానెళ్లు, ఆరోగ్య కార్డులను పంపిణీ చేయనున్నారు









