అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం మండలంలోని వీపీ తాండ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల అభ్యాస స్థాయి తక్కువగా ఉండటం, రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం.
పారిశుధ్య లోపాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన సేవలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అంగన్‌వాడీ టీచర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.










