● రామనగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
● ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి
అల్వాల్,నవంబర్22:రామనగర్‌లో నిర్వహించిన పల్స్ పోలియో వ్యాధి నిరోధక కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. రెండు చుక్కల మందుతో చిన్నారులను పోలియో మహమ్మారి నుంచి రక్షించవచ్చని, పిల్లల ఆరోగ్య భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములైన వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తల సేవలను ఆమె అభినందించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహనతో పాటు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు.
#Sidhumaroju
Alwal










