పుంగనూరులో జర్నలిస్టులకు కేటాయించిన ఇంటి స్థలాలను కబ్జా చేస్తే సహించేది లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు హెచ్చరించారు. పట్టణంలోని ధోబి ఘాట్ వద్ద ఆయన జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలను పరిశీలించారు.
2000 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మేలుపట్ల రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనెంబర్ 97/4లో లేఅవుట్లు వేసి పదిమంది విలేకరులకు పట్టాలు అందజేసిందని, అయితే కొంతమంది ఆ స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు# కొత్తూరు మురళి.










