తెలంగాణలో వడ్ల కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బీజేపీ “రైతు గోస – బిజెపి భరోసా” కార్యక్రమాన్ని చేపట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం గజ్వేల్, జనగామతో పాటు పలు జిల్లాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తోంది. అయితే, నేతలు ప్రీమియం బస్సుల్లో పర్యటించడంపై, క్షేత్రస్థాయిలో ముందే ఏర్పాట్లు చేసుకుని వెళ్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, అన్నదాతలకు పూర్తిస్థాయిలో అండగా నిలవాలని ఈ సందర్భంగా బీజేపీ బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.










