సింగరేణి సంస్థను దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థల్లో ఒకటిగా చెప్పుకుంటారు. వేలాది మంది కార్మికుల చెమటతో నడుస్తున్న ఈ సంస్థలో, ఇటీవల కార్మికుల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోందని కార్మిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా కార్మికుల సమస్యలపై అవగాహన లేని వారిని డైరెక్టర్ స్థాయిలో నియమిస్తే “రక్తపింజార”లాంటి కొందరు డైరెక్టర్లు కేవలం అధికార ప్రదర్శనకే పరిమితమై, కార్మికుల అసలు సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి,గనుల్లో ప్రాణాలకు తెగించి పని చేస్తున్న కార్మికులకు సరైన భద్రత,మెడికల్ బోర్డు,మారుపేర్లు,100 మాస్టర్ల పేరుతో ఉద్యోగాలు తీసివేయడం, ఉద్యోగ భరోసా వంటి అంశాలు అత్యంత కీలకం. కానీ ఫీల్డ్ స్థాయిలో ఎదురవుతున్న సమస్యలు డైరెక్టర్ స్థాయికి చేరినా, వాటిపై స్పందన లేకపోవడం కార్మికులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ప్రమాదాల్లో గాయపడిన కార్మికులకు సరైన సహాయం అందకపోవడం, మెడికల్ బోర్డుల్లో పారదర్శకత లేకపోవడం, ఇన్‌వాలిడేషన్ కేసుల్లో ఆలస్యం వంటి అంశాలపై కార్మిక సంఘాలు ఎన్నోసార్లు గళమెత్తినా ఫలితం కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు










