మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక మహిళ వారోత్సవాల్లో పాల్గొని మంచిర్యాల నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు 53,10,75,000 /- రూపాయల చెక్కును అందజేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ , మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ,స్వయం సహాయక సంఘాల మహిళలకు భారీ ఆర్థిక చేయూతనిచ్చేలా చెక్కులను అందజేశాము. గ్రామీణ ప్రాంతాల సమగ్ర వికాసమే ధ్యేయంగా మహిళల ఉపాధిని, స్థానిక వసతులను పెంపొందించేలా హెచ్‌పీ పెట్రోల్ బంక్ కుడా వచ్చింది.. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేందుకు నా లక్ష్యం అని తెలిపారు,ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, DRDA కిషన్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, హజీపూర్, లక్షెట్టీపేట్, దండేపల్లి మండలాల మహిళా సంఘాల సభ్యులు , ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు









