భరత్ నగర్‌లో రూ.14 లక్షల పైప్లైన్ పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన

0
5

హైదరాబాద్, కూకట్పల్లి, మే 29: కూకట్పల్లి నియోజకవర్గంలోని భరత్ నగర్ హెచ్.ఐ.జి ప్రాంతంలో రూ.14 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన పైప్లైన్ పనులకు శుక్రవారం మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటం తన బాధ్యత అని తెలిపారు. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కొరత లేకుండా తరచూ శంకుస్థాపనలు జరిగేవని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా కూకట్పల్లి అభివృద్ధికి సరిపడా నిధులు మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అరకొర నిధులతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడం కష్టంగా మారిందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని, మూడుసార్లు అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, బిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.