సిటిఎం చెరువు గట్టున మృత శిశువు కలకలం.

0
6

మదనపల్లె మండలం సీటీఎం చెరువు గట్టు వద్ద బుధవారం ఒక బాలుడి మృతదేహం లభ్యం కావడంతో తీవ్ర కలకలం రేగింది. మదనపల్లె–తిరుపతి హైవే పక్కన ముళ్ల పొదల్లో టవల్‌లో చుట్టిన స్థితిలో మృత శిశువును స్థానికులు గుర్తించి తాలూకా పోలీసులకు సమాచారం అందించారు.

సీఐ కళా వెంకటరమణ, ఎస్సై చంద్రమోహన్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత శిశువు వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.