ఈ నెల 27న గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టి పల్లె గ్రామంలో జరగనున్న ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ హర్షవర్ధన్ రాజు గార్లతో కలిసి పరిశీలించాను.
సభా వేదిక, హెలిపాడ్, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ మరియు భద్రతా ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు అవసరమైన సూచనలు చేసి, భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశమున్నందున అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేసి సభను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించాను










